
ప్రధాని సభకు ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఈనెల 16న ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు పరిశ్రమల యజమానులు హాజరుకావాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం చాంద్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు జరిగే సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ సభకు జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల యజమానులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘ సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రధాని నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటన నేపధ్యంలో ఆయన నిర్వహించే సభకు రాయలసీమ జిల్లాల నుంచి 3300 ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. తిరుపతి నుంచి 320, చిత్తూరు 280, అన్నమయ్య 225, వైఎస్సార్ 340, నంద్యాల 310, కర్నూలు 225, అనంతపురం 225, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 260 బస్సులు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు.
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16న గురువారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించే ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి, సభ్యులు జి. మధుకుమార్, ఏ. శ్రీనివాస బాబు, విజయలక్ష్మి పాల్గొని వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తారన్నారు. వినియోగదారులకు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ఈ ప్రత్యేక ఆదాలత్‌కు హాజరై పరిష్కరించుకోవాలని సూచించారు.