
కబ్జాకు గురైన భూముల పరిశీలన
ఓబులవారిపల్లె : బాలిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను తహసీల్దార్ యామినిరెడ్డి మంగళవారం పరిశీలించారు. బాలిరెడ్డిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్‌లు 1293, 1294/1, 1295/1, 2,3,4,5లలో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని సీపీఐ నాయకులు పలుమార్లు తహసీల్దార్ యామినీ రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ మంగళవారం బాలిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలో భూములు, వై.కోట 1155 సర్వే నెంబర్లు దాదాపు 222 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆమె పరిశీలించారు. పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు. బీకేఎన్‌యూ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండుగోల మణి మాట్లాడుతూ 15 రోజులలోగా భూ కబ్జాలను అరికట్టి దళిత గిరిజనులకు పంపిణీ చేయాలని లేనిపక్షంలో భూ పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మహేష్, ఆర్‌ఐ మల్లికార్జున రెడ్డి, సర్వేయర్ నాగలక్ష్మి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, మండల కార్యదర్శి చింతలపూడి నాగమ్మ, నియోజకవర్గ కార్యదర్శి ఎం.జయరామయ్య, మండల కార్యదర్శి మల్లిక, వెంకటరమణ, గోపాల్ పాల్గొన్నారు.