
108లో మహిళ ప్రసవం
నిమ్మనపల్లె : 108 వాహనంలో ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆదివారం జరిగింది. మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ సోమానుపల్లెకు చెందిన గణేష్ భార్య వాణి(23) మూడో కాన్పులో భాగంగా ఆదివారం ఉదయం పురిటినొప్పులు అధికం కావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. నిమ్మనపల్లె 108 అంబులెన్స్ వాహనంలో ఈఎంటీ రెడ్డి జశ్వంత్ పైలట్ సద్దాంతో కలిసి వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆమెను అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువస్తుండగా, మార్గంమధ్యలోని వశిష్ట స్కూల్ వద్ద 108లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రసవానంతర చికిత్సల కోసం వారిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చేర్పించినట్లు ఈఎంటీ రెడ్డిజశ్వంత్ తెలిపారు.
లోవోల్టేజీ సమస్య లేకుండా చర్యలు
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్య లేకుండా తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, క్రీడ, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి పట్టణం చిత్తూరు రోడ్డులో గల విద్యుత్ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా నూతన సర్కిల్ ఆఫీస్‌ను ఆయన ప్రారంభించారు. మంత్రి మండిపల్లికి విద్యుత్ ఉద్యోగులు దుశ్శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీఐఐసీ డైరెక్టర్ కొండారెడ్డి భాస్కర్, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.