
టైరు పంక్చర్.. కారు బోల్తా
పులివెందుల : మండలంలోని గొందిపల్లె గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పులివెందుల వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్‌రెడ్డి సోదరుడు గంగిరెడ్డితో కలిసి సొంత పని మీద కడపకు వెళ్లారు. అక్కడ పని ముగించుకొని పులివెందులకు వస్తుండగా మార్గంమధ్యలో వేముల సమీపంలోని గొందిపల్లె గ్రామ సమీపంలో కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో హాల్ గంగాధర్‌రెడ్డి, గంగిరెడ్డికి గాయాలయ్యాయి. చికిత్స నిమత్తం వీరిని పులివెందులకు తరలించారు.
పరామర్శించిన వైఎస్ మనోహర్‌రెడ్డి
కారు ప్రమాదంలో గాయపడిన హాల్ గంగాధర్‌రెడ్డి, సోదరుడు గంగిరెడ్డిలను పులివెందుల ఒక ప్రయి వేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకొని వారిని పరామర్శించారు. కార్యక్రమంలో నూరుబాషా సంఘ నాయకులు రసూల్, కౌన్సిలర్ కోడి రమణ, ఖాదర్, పురుషోత్తం, కోఆప్షన్ చంద్రమౌళి, వైఎస్సార్‌సీపీ నాయకులు పద్మనాభరెడ్డి, హరి, కుళ్లాయప్ప పాల్గొన్నారు.
ఇద్దరికి గాయాలు