
సెగ్మెంట్.. సంపద!
పులివెందుల
కడప నగర వ్యూ
రాజంపేట: ఉమ్మడి కడపలో జిల్లాలో ధనిక నియోజకవర్గాలను గుర్తించారు. డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వెలువరించిన సమాచారం మేరకు పులివెందుల ప్రథమ, బద్వేలు పదోస్థానంలో ఉంది. నియోజకవర్గాల అభివృద్ధి, పాడిపంటలు, పరిశ్రమలు లాంటి వాటిని భేరీజు చేసుకొని ఏ నియో జకవర్గం ధనికమో తేల్చారు.
బద్వేలు..
10వ స్ధానంలో ఉన్న బద్వేలు నియోజకవర్గం సంపద రూ. 2746 కోట్లు. పాడిపరిశ్రమంలో జిల్లాలో రెండో స్థానంలో ఉంది. ఫిషింగ్ సెక్టారులో జిల్లాలో మొదటి స్థానంలోఉంది. మిగిలిన అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది.
ప్రొద్దుటూరు..
తొమ్మిదో స్థానంలో ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గం సంపద రూ.2778 కోట్లుగా ఉంది. వ్యవసాయ, పరిశ్రమల సెక్టారులో వెనుకబడి ఉంది. బంగారు, టెక్స్‌టైల్స్ వ్యాపారంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది.
రైల్వేకోడూరు..
8 స్థానంలో ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గం సంపద రూ3292కోట్లుగా ఉంది. మంగంపేట బైరెటీస్, ఉద్యాన వనంతో అభివృద్ధి చెందింది. మిగిలిన రంగాల్లో అభివృద్ధి చెందాలి.
కమలాపురం..
7వ స్థానంలో ఉంది. ఈ నియోజకవర్గ సంపద 3358 కోట్లు ఉంది. చిన్నపాటి ఆటోమొబైల్, ఇండ్రస్టీగా అభివృద్ధి చెందింది.
మైదుకూరు.
6 వస్థానంలో ఉంది. ఈ నియోజకవర్గ సంపద రూ, 3430 కోట్లుగా ఉంది. వ్యవసాయరంగంలో రెండోస్ధానంలో ఉంది, వేరుశనగ అధిక విస్తీర్ణంలో సాగవుతుంది.
రాజంపేట..
5వ స్థానంలో ఉన్న రాజంపేట నియోజకవర్గ సంపద 3629 కోట్లుగా ఉంది. లైమ్‌స్టోన్, క్వారీ ఎక్కువగా జరుగుతుంది. అప్పుడప్పుడు కరవు వల్ల రైతులు నష్టపోతున్నారు.
కడప..
4వ స్థానంలో ఉన్న కడప నియోజకవర్గ సంపద రూ. 3718 కోట్లు. మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి.
రాయచోటి..
3వ స్థానంలో ఉన్న రాయచోటి నియోజకవర్గ సంపద రూ. 4145 కోట్లు. ఈ ప్రాంతం రియల్‌ఎస్టేట్, నిర్మాణ రంగంలో అభివృద్ధి చెందింది.
జమ్మలమడుగు..
2 స్థానంలో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం సంపద రూ.4906 కోట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పరిశ్రమల రంగంలో బాగా ఉంది.
జగన్నపాలనలో నియోజకవర్గాల అభివృద్ది..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో నడిచాయి.ఇప్పుడు కూటమి పాలనలో నియోజకవర్గాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదనే అపవాదు ను మూటకట్టుకుందని పరిశీలకులు భావిస్తున్నారు.
నియోజకవర్గం సంపద (రూలలో)
పులివెందుల నియోజకవర్గ సంపద రూ. 5573 కోట్లు. వ్యవసాయరంగంలో ప్రథమ స్థానంలో ఉంది. తుమ్మలపల్లె యురేనియం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద యురేనియం మైన్స్‌లో ఒకటిగా
ప్రథమస్ధానంలో పులివెందుల
పదో స్ధానంలో బద్వేలు..
జగనన్న పాలనలోనియోజకవర్గాల అభివృద్ధి
పులివెందుల 5573
జమ్మలమడుగు 4906
రాయచోటి 4145
కడప 3718
రాజంపేట 3629
మైదుకూరు 3430
కమలాపురం 3358
రైల్వేకోడూరు 3292
ప్రొద్దుటూరు 2778
బద్వేలు 2746

సెగ్మెంట్.. సంపద!

సెగ్మెంట్.. సంపద!