
13 నుంచి తిరుపతిలో రెసిడెన్సియల్ శిక్షణ
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కడపజిల్లా రైతు సాధికారత సంస్థ వారి ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫామింగ్(ఎన్‌ఎంఎన్‌ఎఫ్) పోగ్రాం ద్వారా బయో రీసోర్సు సెంటర్‌పై ఈ నెల 13వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వననున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రకృతి సేద్యం ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తిరుపతిలో రెసిడెన్సియల్ శిక్షణా కేంద్రంలో శిక్షణకు ఆసక్తి గలిగిన రైతులు 9849900965 నెంబర్‌కు కాల్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో రెండోశనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూల విరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. సీతారామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. రెండో శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పొటెత్తారు.
రాయచోటి: ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన కార్యక్రమంలో జిల్లాలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం దేశవ్యాప్తంగా వంద జిల్లాలో పీఎం ధన ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావడం, పంటల రుణాలను రైతులకు చేరవేయడమే లక్ష్యంగా ఈ పథకం అమలవుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇతర అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌న్‌చార్జి వ్యవసాయాధికారి మజీద్ అహ్మద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి, పీడీ ఏపీఎంఐపీ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి గుణశేఖర్ పిళ్‌లై, నాబార్డు అధికారి విజయ విహారం, ఎల్‌డీఎం ఆంజేయులు, జిల్లా సహకార శాఖ అధికారి గురు ప్రకాష్, మత్స్యశాఖ అధికారి సుశ్మిత, జిల్లా సాగునీటి శాఖ అధికారి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

13 నుంచి తిరుపతిలో రెసిడెన్సియల్ శిక్షణ