హెడ్‌ ఫోస్టాపీసు ఎదుట ధర్నా | - | Sakshi
Sakshi News home page

హెడ్‌ ఫోస్టాపీసు ఎదుట ధర్నా

Oct 11 2025 6:20 AM | Updated on Oct 11 2025 6:20 AM

హెడ్‌

హెడ్‌ ఫోస్టాపీసు ఎదుట ధర్నా

మదనపల్లె సిటీ : స్థానిక బెంగళూరురోడ్డులోని హెడ్‌ ఫోస్టాపీసు ఎదుట శుక్రవారం ఆలిండియా పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు భాగంగా తపాల ఉద్యమ జాతీయ నాయకుడు మహదేవయ్యను ఉద్యోగంలోకి తొలగించినందుకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్‌ నాయకులు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కమలేష్‌ చంద్ర కమిటీ ఇచ్చిన సానుకూల సిఫార్సులను అమలు చేయని కారణంగా క్రామేడ్‌ మహదేవయ్య ఆధ్వర్యంలో 2023 డిసెంబర్‌లో నిరవధిక సమ్మె చేశామన్నారు. ఆనాడు సమ్మెకు నాయకత్వం వహించినందుకు చార్జిషీట్‌ ఇచ్చి ఈనెల 8వతేదీన ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. మహదేవయ్యను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో భాస్కర్‌, సర్దార్‌, విజయకుమార్‌, రామమూర్తి, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సౌత్‌ ఇండియా లెవెల్‌ క్యారమ్స్‌ పోటీలు ప్రారంభం

నందలూరు : నందలూరు రైల్వే కేంద్రంలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో యంగ్‌ మెన్స్‌ క్యారమ్స్‌ అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో సౌత్‌ ఇండియా లెవెల్‌ క్యారమ్స్‌ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్‌ ఇండియా జోన్‌ లెవెల్లో నందలూరులో టోర్నమెంట్‌ జరపడం ఎంతో సంతోషం అన్నారు. క్రీడాకారులకు, కళాకారులకు మేడా కుటుంబం ఎప్పుడూ తోడుగా ఉంటుందని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలలో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనడం విశేషం. క్రీడాకారులకు మూడు రోజుల పాటు భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కార్యక్రమంలో యంగ్‌ మెన్స్‌ క్యారమ్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బిఎన్‌ శంకర్‌, సభ్యులు ఆర్ముగం విశ్వనాథ్‌, పల్లె గ్రీస్మంత్‌రెడ్డి, వేపగుంట శ్యామ్‌రాజ్‌, నాగభూషణం, శివకోటి, గురుప్రసాద్‌, జంగంశెట్టి హరిప్రసాద్‌, ముమ్మడిశెట్టి సుధాకర్‌, మండల జేసీఎస్‌ కన్వీనర్‌ కలీముల్లాఖాన్‌, మాజీ ఏజీపీ శమీవుల్లాఖాన్‌, ఆనాల మధుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను

ధైర్యంగా ఎదుర్కోవాలి

– జిల్లా మహిళా సోషల్‌ కౌన్సిలర్‌ ఫిమా అంజుమ్‌

రాయచోటి అర్బన్‌ : బాలికలకు సమాజంలో ఆకస్మికంగా ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని జిల్లా మహిళా సోషల్‌ కౌన్సిలర్‌ ఫిమా అంజుమ్‌, పారా లీగల్‌ సభ్యులు చంద్రకళ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని శ్రీ షిర్డిసాయి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. మహిళల పట్ల జరిగే అన్యాయాలు, అక్రమాలను ఏ విధంగా ఎదుర్కొవాలో తెలిపారు. మహిళా సాధికారిత , ఉమెన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గురించి తెలిపారు. జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధారంగా ఏర్పాటు చేసిన వన్‌ స్టాప్‌ సెంటర్‌ సర్వీస్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ డిపార్ట్‌ మెంట్‌ ద్వారా బాలికలకు, మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. పని చేస్తున్న ప్రదేశంలో సమస్యలు, లైంగిక వేధింపులు ఉన్నప్పుడు వాటిని ఎలా ఎదుర్కొవాలో తెలియజేశారు. పెళ్లి తరువాత ఎదురయ్యే మానసిక, శారీరక సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వివరించారు.

హెడ్‌ ఫోస్టాపీసు ఎదుట ధర్నా 1
1/2

హెడ్‌ ఫోస్టాపీసు ఎదుట ధర్నా

హెడ్‌ ఫోస్టాపీసు ఎదుట ధర్నా 2
2/2

హెడ్‌ ఫోస్టాపీసు ఎదుట ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement