
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేంపల్లె : చక్రాయపేట మండలంలోని గొంది అడవుల్లో నక్కలదిన్నెపల్లె గ్రామ వాసి బండ్లపల్లె ప్రతాప్ రెడ్డి (55) అనే వ్యక్తి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చక్రాయపేట మండలంలోని నక్కలదిన్నెపల్లె గ్రామానికి చెందిన బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి, గడ్డంవారిపల్లె గ్రామానికి చెందిన యోగేశ్వరరెడ్డి కలిసి శనివారం గొంది గ్రామ సమీపంలోని తెల్లకొండ అడవి ప్రాంతానికి మంచం కోళ్లకు సంబంధించి కొయ్యలు తీసుకొచ్చేందుకు వెళ్లారు. అయితే గొంది అడవి ప్రాంతంలోని తెల్లకొండ సమీపంలో ప్రతాప్‌రెడ్డికి తేనెటీగలు కుట్టి అక్కడికక్కడే మృతి చెందాడని యోగీశ్వరరెడ్డి మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి కుమారుడు నవీన్‌కుమార్‌రెడ్డి, బంధువులతో కలిసి పోలీసులు గొంది సమీపంలోని అడవి ప్రాంతానికి వెళ్లి ప్రతాప్‌రెడ్డి మృతదేహన్ని పరిశీలించారు. మృతదేహన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా.. మృతి జరిగిన సంఘటనపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో కడప రిమ్స్‌కు తరలించారు. కడప రిమ్స్‌లో ప్రతాప్‌రెడ్డి మృతదేహనికి పోస్టుమార్టం చేసి బంధువులకు పోలీసులు అప్పగించారు. నవీన్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
పెద్ద దర్గా దర్శించుకున్న వక్ఫ్‌బోర్డ్ సీఈవో
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని పెద్ద దర్గాను వక్ఫ్ బోర్డ్ సీఈవో మహమ్మద్ అలీ ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ సయ్యద్ దావూద్ బాషా ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం వక్ఫ్ బోర్డ్ సీఈఓ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకుడు లయన్ పటాన్ ఖాదర్‌బాషా, దర్గా ముజావర్ అమీర్, మేనేజర్ అలీఖాన్, బీఎండబ్ల్యూ ఇదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు.