
అర్జీదారుల వేదన తీరడం లేదు. ‘దరఖాస్తులు కొండంత.. పరిష్క
● సమస్యలతో సతమతమవుతున్న జనం
● పరిష్కారం కాక ఆందోళన
● కలెక్టరేట్‌కు పరుగులు
● కూటమిపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత
సాక్షి రాయచోటి : ప్రజలకు అనేక హామీలు ఇచ్చి పట్టించుకోకపోవడంతో అన్ని వర్గాలు తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నాయి. ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మమ అనిపిస్తుండడంతో నిరసన గళం వినిపిస్తున్నారు. ఆక్రమణల పర్వంపై ప్రజలు, భూకబ్జాలపై బాధితులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు, సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏలు ఇలా అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రతి సోమవారం కూటమి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు బాధితులు బారులు తీరుతున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోతుండటం... తీర్చే వారు కనిపించకపోవడంతో కలెక్టరేట్ వైపు కదులుతున్నారు. మరోపక్క ప్రభుత్వంపై పలు వర్గాలు ఆందోళనకు పిలుపునిస్తున్నాయి.
వీఆర్‌ఏల డిమాండ్లు నెరవేర్చాలి
అన్నమయ్య జిల్లాలోని వీఆర్‌ఏల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఏపీ వీఆర్‌ఏల సంఘం ఉపాధ్యక్షుడు రెడ్డెప్ప ఆధ్వర్యంలో సుమారు 30 మంది వీఆర్‌ఏలు తమ డిమాండ్ల సాధనకై ఉద్యమించారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల రాష్ట్ర పిలుపు మేరకు ఇప్పటికే తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేశామని, ఇప్పుడు కలెక్టరేట్ వద్ద ఉద్యమించినట్లు వివరించారు. వీఆర్‌ఏలకు సంబంధించి వెంటనే పే స్కేలు అమలు చేయాలని, రాత్రిపూట నైట్ డ్యూటీలు తప్పించాలని నినందించారు. అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని, వీఆర్‌ఏల సర్వీసులను పర్మినెంట్ చేయాలని, రికవరీ చేసిన డీఏలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు నినాదాలు చేశాక లోనికి వెళ్లి జిల్లా జాయింట్‌కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.
మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయండి : ఏఐటీయూసీ
రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన మెడికల్ కళాశాలల పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వైద్య విద్యను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకుందని, ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విలువైన ప్రజాధనాన్ని ప్రైవేట్ వారికి అతి చౌకగా కట్టబెట్టే పీపీపీ విధానం వైద్యరంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడంలో భాగమని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దారుణమన్నారు. కళాశాలల ప్రైవేటీకరణకు జారీ చేసిన పీపీపీ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కబ్జాదారుల నుంచి చెరువును రక్షించాలి
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె గ్రామంలోని ఓటుకుంట చెరువును అక్రమార్కులు కబ్జా చేశారని, వారి బారి నుంచి చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరారు. గత ప్రభుత్వంలో రీ సర్వే చేశారని, అయితే సర్పంచులు, వీఆర్‌ఓలు సక్రమంగా సర్వే చేయించకుండా రైతులకు 1బి అడంగల్ రాకుండా చేశారన్నా రు. డీకేటీ భూములకు ఇప్పటికీ కూడా 1బీ రావడం లేదన్నారు. 50 ఏళ్ల కిందట ఇచ్చిన భూములను ప్రభుత్వ భూమిగా మార్చారన్నారు. ఆయా భములకు 1బీ అడంగల్ వచ్చేలా చేయాలని కోరారు.
కదం తొక్కిన కరెంటు ఉద్యోగులు

అర్జీదారుల వేదన తీరడం లేదు. ‘దరఖాస్తులు కొండంత.. పరిష్క