
యువతిని మోసగించిన కేసులో వ్యక్తికి రిమాండ్
కలికిరి : యువతిని మోసగించిన కేసులో కలికిరికి చెందిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ(ఉన్నతవిద్య) చదువుతున్న యువతిని కలికిరి పట్టణానికి చెందిన పఠాన్ ఇమ్రాన్‌ఖాన్ ప్రేమ పేరుతో వెంటబడి వంచించాడు. అనంతరం యువతితో వున్న ఫొటోలను ఆమె బంధువులు, స్నేహితులకు పంపి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె కలికిరికి చేరుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ అనీల్‌కుమార్ నిందితుడిని శనివారం సాయంత్రం వాల్మీకిపురం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నిందితుడిని రిమాండ్ విధించినట్లు తెలిపారు.
గంజాయి స్వాధీనం: ముగ్గురి అరెస్ట్
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని బిజ్జవారిపల్లి క్రాస్ వద్ద ఆదివారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ నీలకంఠ, సీఐ తులసీ ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు. ఐదుగురు 2.700 కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. రాకేష్, హరి, సుమన్‌లను అరెస్ట్ చేసి ఆటో, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో ఇరువురు పరారీలో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. అరెస్ట్ చేసినవారిని కోర్టులో హాజరు పరిచారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
కేవీపల్లె : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని దిగవగళ్ల గంటావారిపల్లెలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గంటావారిపల్లెకు చెందిన అనసూయమ్మ ఇంటిలో విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం మంటలు వ్యాపించాయి. గ్రామస్తులు పీలేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు అదుపుచేశారు. అప్పటికే ఇంటిలోని వస్తువులు కాలిబూడిదయ్యాయి. విలువైన వస్తువులు, ఆస్తి పత్రాలు మంటల్లో కాలిపోయినట్లు బాధితురాలు తెలిపారు.
యువతి ఆత్మహత్య
ఎర్రగుంట్ల : మండలంలోని పెద్దనపాడు గ్రామానికి చెందిని చిలంకూరు గంగమ్మ (25) ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని యర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. పెద్దనపాడుకు చెందిన వీరాంజనేయులు, లక్ష్మీదేవి కుమార్తె గంగమ్మ. గంగమ్మకు పెళ్లి చూపులు చూస్తున్నా.. అవి కుదరడం లేదు. దీంతో గంగమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

యువతిని మోసగించిన కేసులో వ్యక్తికి రిమాండ్