
పెద్ద వలంటీర్లమట
కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఒక్క సమస్య కూడా పరిష్కారం లేదు. కనీస డిమాండ్లు తీర్చకపోగా తమను పెద్ద వలంటీర్లని ఎగతాళి చేస్తున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పని చేయిస్తున్నారు. సంబంధం లేని విధులు అప్పగి స్తున్నారు. సర్వేల సమయంలో ప్రజలు ఓటీపీలు చెప్పడం లేదు, వాటిని ఎలా పూర్తి చేయాలి. ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
–జంగాల నందిని, మహిళా పోలీసు జేఏసీ కార్యనిర్వాహక కార్యదర్శి