
వాకర్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్‌గా చేజర్ల
రాజంపేట: వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్‌గా రాజంపేటకు చెందిన చేజర్ల సుబ్రహ్మణ్యంరాజు ఎన్నికయ్యారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 302 కేబినెట్ సమావేశం జరిగిందని తెలిపారు. నడకతో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యంగా ఉంటారన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చేజర్లను వాకర్స్ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి ప్రెసిడెంట్ డా.రవిరాజు, డిస్ట్రిక్ గవర్నర్ మాధవ నాయుడు, కొండూరు శరత్‌రాజు, కోనేటి రవిరాజు, వినాయగం, మనోహర్, పాండ్యన్, మునికృష్ణ, రామ్మోహన్‌వర్మ, శంకర్‌రాజు, సురేష్‌రాజు పాల్గొన్నారు.
కాలువలో పడ్డ స్కార్పియో
పులివెందుల రూరల్ : మండలంలోని రచ్చుమర్రిపల్లె వద్ద స్కార్పియో వాహనం అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కదిరి మండలం పట్నం పంచాయతీ ఏటిగడ్డ తండా గ్రామానికి చెందిన కిరణ్, శ్రీనివాసనాయక్, నారాయణ స్వామి, చంద్రనాయక్, రమేష్‌నాయక్, మహేంద్రబాబులతోపాటు మరో ఎనిమిది మంది జమ్మలమడుగు నియోజకవర్గ సమీపం లోని తండాకు స్కార్పియోలో బయలుదేరారు. రాయలాపురం వంతెన సమీపంలోని కాల్వ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం కాల్వలో పడిపోయింది. దీంతో స్కార్పియోలోని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులు తమబంధువు పెళ్లిచూపులకు వెళ్తున్నట్లు వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కరస్పాండెంట్‌పై పోక్సో కేసు
మైదుకూరు : తన పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్‌పై మైదుకూరు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. స్థానిక ఓ పాఠశాలలో సదరు విద్యార్థిని ఒకటో తరగతి నుంచి చదువుతోంది. తల్లి కువైట్‌కు వెళ్లగా తండ్రితో కలిసి అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిపై కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు స్టడీ అవర్స్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రెండు నెలలుగా విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోవడంతో అమ్మమ్మ అడిగింది. దీంతో కరస్పాండెంట్ ప్రవర్తన గురించి చెప్పింది. ఆ విషయమై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విద్యార్థినితో వెంకటేశ్వర్లుపై ఫిర్యాదు చేయించింది. ఆ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు అర్బన్ ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.
స్కూల్ బస్సు ఢీకొని ఒకరు మృతి
మైదుకూరు : మండలంలోని మాచుగారిపల్లె స్కూల్ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వస్తున్న లంకల చిన్నఓబులేసు(45) మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గంగాయపల్లెకు చెందిన చిన్న ఓబులేసు శుక్రవారం సాయంత్రం మాచుగారిపల్లె గ్రామానికి వస్తున్నారు. జీవీ.సత్రంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సుమాచుగారిపల్లె వద్ద బైక్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిన్న ఓబులేసును కడప రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి అన్న కుమారుడు లంకల ఓబులేసు ఫిర్యాదు మేరకు అర్బన్ ఏస్‌ఐ సుబ్బారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మితిమీరుతున్న స్కూల్ బస్సుల వేగం
జీవీ సత్రంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు మితిమీరిన వేగంతో తిరగడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలుస్తున్నాయి. జీవీ సత్రానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని గతంలో ట్రాన్స్‌జెండర్ మృతి చెందగా, తాజాగా బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో మరొకరు మృతి చెందారు. విద్యార్థుల భద్రత పట్టించుకోకుండా డ్రైవర్లు వాహనాలను వేగంగా నడుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
నవోదయలో సైన్స్ గ్రూప్ ఖాళీల భర్తీకి చర్యలు
– సెప్టెంబరు 23 వరకు దరఖాస్తుల స్వీకరణ
రాజంపేట : మండలంలోని నారమరాజుపల్లె సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సైన్స్ గ్రూపులో(2025–2026) ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ కె.గంగాధరన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతిలో సైన్స్, గణితంలో 60 శాతం మార్కులు, సరాసరి 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. విద్యార్థులు స్వయంగా వ చ్చి సెప్టెంబరు 23వ తేదిలోగా దరఖాస్తు అందచేయాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబి తా, టీసీ వెంట తీసుకురావాలన్నారు. స్పాట్ అ డ్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా వాసులేగాక ఇతర జిల్లాల విద్యార్థులు చేరవచ్చునన్నారు.

వాకర్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్‌గా చేజర్ల

వాకర్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్‌గా చేజర్ల