
శ్రీ భద్రకాళీ అమ్మవారికి రాహుకాల పూజ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో అమ్మవారికి రాహుకాల పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి రాహుకాల పూజలు నిర్వహించి పూలు, బంగారు ఆభరణాలు, బంగారు ఆభరణాలతో పాటు నిమ్మకాయలతో హారాలతో అందంగా అలంకరించి భక్తుల దర్శన ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు అమ్మవారికి నిమ్మకాయలపై ఒత్తులు వెలిగించి హారతులు పట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచి పెట్టారు.
అత్తపై దాడిచేసిన
అల్లుడు అరెస్టు
నందలూరు : లేబాక గ్రామ పంచాయతీ మరాటి పల్లి గ్రామంలో అత్తపై దాడి చేసి పారిపోయిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 7 తేదీన సాయంత్రం లేబాక మరాఠ పల్లి కి చెందిన సింధే పద్మావతిభాయిని చంపాలనే ఉద్దేశంతో మచ్చుకత్తితో దాడిచేసి పారిపోయిన వాయకారి నరసింహులును నందలూరు బస్ స్టాండ్ వద్ద అదుపులోకి తీసుకొని అతని నుంచి మచ్చుకత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతపురం టౌన్ కి చెందిన నరసింహులుకి 13 సంవత్సరాల క్రితం పద్మావతి భాయి కుతూరు మంజుల భాయితో వివామైంది. వారికి ఒక కొడుకు, కుతూరు ఉన్నారు. నరసింహులు చెడు అలవాట్లకు భానిసై భార్యను పిల్లలను పట్టించుకోకుండా హింసిస్తూ ఉండటంతో మంజుల భాయి భర్తకు దూరంగా తన ఇద్దరి పిల్లలను తల్లి పద్మావతి భాయి దగ్గర ఉంచింది. బతుకుదెరువు నిమిత్తం కువైట్కి వెళ్ళింది. అయితే భార్యా, పిల్లలు దూరం కావడానికి అత్తే కారణమని పగ పెంచుకొని, అతడి జల్సాలకు డబ్బు ఇవ్వలేదనే కోపంతో పద్మావతి భాయిని చంపాలని ప్లాన్ వేసుకొని ఈనెల 7వ తేదీ సాయంత్రం మచ్చుకత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై పద్మావతి భాయి కోడలు శ్యామల భాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి వాయకారి నరసింహులును ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బంది అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం నందలూరు కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.