
నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి
మదనపల్లె సిటీ: నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా టీబీ, ఎయిడ్స్,లెప్రసీ అధికారి డాక్టర్ రమేష్‌బాబు అన్నారు. గురువారం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఎఆర్‌టీ,ఐసీటీసీ,ఎస్‌టీఐ సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. హెచ్‌ఐవీ కేసులు నమోదు చేసి ఏఆర్‌టీలో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించాలన్నారు. ఐఈసీ క్యాంపెయిన్ కాలేజీలు, హైరిస్క్ ప్రాంతాల్లో చేయాలన్నారు.హెచ్‌ఐవీపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రతి హెచ్‌ఐవీ పాజటివ్ కేసులోనూ టీబీ పరీక్షలు చేయించాలన్నారు.ఐసీటీసీ,ఏఆర్‌టీ కేంద్రాల్లో సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఎన్‌జీఓలతో కలిసి హైరిస్క్ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం డేవిడ్ భాస్కర్, ఐసీటీసీ కౌన్సిలర్లు జయకుమార్,చంద్రమోహన్, పుల్లయ్యనాయుడు, దీప్తితో పాటు ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.
డీఎఎల్‌టీఓ రమేష్‌బాబు