
రాయచోటిలో కళా ఉత్సవ్
రాయచోటి : విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభ వెలికి తీసేందుకు కళా ఉత్సవ్–2025 జిల్లా స్థాయి పోటీలు గురువారం రాయచోటి డైట్‌లో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం ప్రారంభించి మాట్లాడుతూ తమ ప్రతిభ ప్రదర్శించేందుకు విద్యార్థులకు చక్కటి వేదిక కళా ఉత్సవ్ అన్నారు. జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ గాత్ర, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్య కళలు, కథా కథనం పోటీల్లో 146 మంది విద్యార్థులు పాల్గొన్నాని తెలిపారు. ఆరు విభాగాలలోని పన్నెండు అంశాలలో రెండు రోజులపాటు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రథమ, ద్వితీయ. తృతీయ స్థానాలు పొందిన వారిని విజేతలుగా ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, నాగమునిరెడ్డి, స్వతంత్ర బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.