
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
మదనపల్లె రూరల్: పిట్ట కొంచెం..కూత ఘనం అన్న నానుడికి సరిగ్గా సరిపోతాడు మదనపల్లెకు చెందిన ఎం.సాయి కార్తికేయ సౌరవ్. వివిధ విభాగాల్లో పిల్లలు సాధించిన విజయాలను గుర్తించే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోవడం సాధారణ విషయం కాదు. పట్టణానికి చెందిన సాయి కార్తికేయ సౌరవ్‌కు ఏడేళ్ల వయస్సులో 40 రకాల రూబిక్ క్యూబ్‌లను అత్యంత వేగంగా పరిష్కరించగలడం, 500 క్యూబ్‌లతో రూబిక్ క్యూబ్స్ మొజాయిక్ ఆర్ట్ చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అతి చిన్న వయస్సులో అతడు చూపిన అసాధారణ ప్రతిభను గుర్తించి ఆసియా బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో పేరు నమోదు చేయడమే కాకుండా, గ్రాండ్ మాస్టర్ సర్టిఫికేట్‌ను అందజేశారు. మదనపల్లె పట్టణం కొత్తపేటలో నివాసం ఉంటున్న డాక్టర్.ఎం.సాయికిషోర్, పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. భార్య శ్రీ గృహిణి. వీరి కుమారుడు ఎం.సాయి కార్తికేయ సౌరవ్(7) బెంగళూరులోని హొరమావు ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడు క్యూబ్స్ పరిష్కారంపై సాయి కార్తికేయ శ్రద్ధను గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో అతడు చిన్నవయస్సులోనే 40 రకాల రూబిక్ క్యూబ్‌ను వేగంగా పరిష్కరించడమే కాకుండా 500 క్యూబ్‌లతో ఈశ్వరుడు, సాయిబాబా, కృష్ణ, కార్తికేయ, రామ, హనుమాన్, దుర్గా, జాతీయపతాకం, ప్రధాని మోదీ, రతన్‌టాటా, ఆస్ట్రోనాట్, సునీతా విలియమ్స్, విరాట్ కొహ్లి, నారుటో కార్టూన్..మొజాయిక్ ఆర్ట్ ద్వారా చిత్రాలను ఆవిష్కరిస్తాడు. సాయి కార్తికేయ సౌరవ్ ప్రతిభను గుర్తించిన ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అతడి పేరును గ్రాండ్ మాస్టర్స్ వరల్డ్‌కింగ్స్ టాప్ రికార్డ్స్ 2025 జాబితాలో నమోదుచేస్తూ ప్రశంసాపత్రాన్ని, సర్టిఫికెట్‌ను పోస్టు ద్వారా మంగళవారం అందజేశారు.
రూబిక్ క్యూబ్స్ మొజాయిక్ ఆర్ట్‌లో మదనపల్లె విద్యార్థి ప్రతిభ

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు