
ఒంటిమిట్ట హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ నెలసరి హుండీ ఆదాయాన్ని మంగళవారం టీటీడీ అధికారులు లెక్కించారు. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆదాయం రూ.3 లక్షల 85 వేల 100 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కడప కోటిరెడ్డి సర్కిల్: కరోనాకు ముందు ఉన్న పది రైల్వే స్టేషన్లలో స్టాపింగ్‌లను పునరుద్ధరిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు కడప రైల్వే కమర్శియల్ ఇన్‌స్పెక్టర్ జనార్థన్ తెలిపారు. 16351 చత్రపతి శివాజీ టర్మినల్ నాగర్ కొయిల్ రైలు రాజంపేట, కోడూరులో ఆగుతుందన్నారు. 16381, 16382 కన్యాకుమారి – పుణే, పుణే – కన్యాకుమారి రైళ్లు నందలూరు, కొండాపురంలలో, 17622 తిరుపతి – ఔరంగబాద్ రైలు ఎర్రగుంట్లలో, 17652 కాచిగూడ చెంగల్‌పట్టు రైలు కోడూరులో, 22102 మధురై లోకమాన్య తిలక్ రైలు రాజంపేటలో స్టాపింగ్‌లు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని రైల్వే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఒంటిమిట్ట హుండీ ఆదాయం లెక్కింపు