
వైభవం..పల్లకీ ఉత్సవం
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి పల్లకీలో ఊరేగారు. ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు ఆలయాన్ని తెరిచారు. ప్రత్యేక పూజలు జరిపారు. రాత్రి స్వామి, అమ్మ వారిని అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చిరు. మాఢవీధులు, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా పోలీసు అధికారులు అలస్వం చేయరాదని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలియపరిచారు. సోమవారం రాయచోటిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులకు వేధింపులు, భర్త, అత్తారింటి వేధింపులు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమపేరుతో మోసం తదితర సమస్యలపై ఫిర్యాదుదారులు నుంచి అర్జీలు అందాయని ఆయన తెలిపారు.సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి సత్వరం బాధితులకు చట్టపరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నేడు సమావేశం
కడప ఎడ్యుకేషన్ : కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు డీవీఈఓ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడిజిల్లా అండర్ 19 ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రమోహన్‌రాజు తెలిపారు. ఎస్‌జీఎఫ్‌ఐ అండర్ 19 స్కూల్ గేమ్స్ సంబంధించి జిల్లా జట్లను ఎంపిక చేయడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని మేనేజ్‌మెంట్లకు సంబంధించిన పీడీ, పీఈటీ, ఇన్‌చార్జు పీడీలు తప్పకుండా హాజరు కావాలని ఆయన తెలిపారు. వివరాలకు 9290760996 సంప్రదించాలని కోరారు.
జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఎంపిక
వేంపల్లె : జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికై నట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ విభాగంలో చదువుతున్న విద్యార్థులు బి.నాగ పవన్, ఎస్.అరవింద్, జి.విజయ్ కుమార్, డి.రవితేజ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని సత్తా చాటారని వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు చత్తీష్‌ఘట్ బిలయోలో నిర్వహించే యోగాసన భారత్ జాతీయ స్థాయిపోటీల్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై డైరెక్టర్‌తోపాటు పరిపాలన అధికారి రవికుమార్, డీన్ రమేష్ కై లాస్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.