
రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం
రాయచోటి: రైతు సంక్షేమం గురించి కూటమి ప్రభు త్వం పట్టించుకోవడంలేదని, అన్నదాతలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని పార్టీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు కె సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఈనెల 9న కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న అన్నదాత పోరుకు సంబంధించిన పోస్టర్‌ను రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాషాతో కలిసి వారు ఆవిష్కరించారు. రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు. ఎరువుల కోసం రైతులు క్యూలో నిలుచుంటే వారికి బఫే ఏర్పాటు చేయాలా అంటూ వ్యవసాయశాఖ మంత్రి అవహేళనగా మాట్టాడటం దారుణమని అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పా టు చేసి, వేలకోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకున్నట్లు చెప్పారు పోరుబాట ద్వారా రైతు వ్యతిరేక ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. యూరియాతో సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలన్నారు. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల భీమాను పునరుద్ధరించి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఈనెల 9న నిర్వహించే అన్నదాత పోరుబాట కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలు ఆకేపాటి అమరనాథరెడ్డి, సురేష్‌బాబు
9న ‘అన్నదాత పోరు’ను విజయవంతం చేయాలి