
ఏమని పిలవాలి..
ప్రస్తుతం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా పిలవాలో, వైద్య కళాశాలగా పిలవాలో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే విచిత్రంగా ప్రభుత్వం రెండు పోస్టులు కొనసాగిస్తోంది. జిల్లా ఆస్పత్రికి ఉండే సూపరిండెంట్ పోస్టు, వైద్య కళాశాలకు ఉండే ప్రిన్సిపాల్ పోస్టును కొనసాగిస్తోంది. ఈ రెండు పోస్టులకు సీనియర్ అధికారి కోటేశ్వరీకి అప్పగించారు. ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చూసేందుకు వైద్య కళాశాల కొనసాగలేదు. సూపరిండెంట్‌గా ఉండేలా జిల్లా ఆస్పత్రిని చేసినట్టుగా కూడా లేదని తెలుస్తోంది. అయితే రెండు పోస్టులు కొనసాగిస్తుండటంతో జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల రెండు కొనసాగుతున్నట్టుగానే భావించాల్సి వస్తుంది.