
● బొప్పాయి రైతులను ఆదుకుంటాం: కలెక్టర్ శ్రీధర్
చిట్వేలి: బొప్పాయి రైతులను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అన్నారు. శనివారం మండలంలోని ఎం గొల్లపల్లి, దేవమాచుపల్లిలో బొప్పాయి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చిట్వేలి, పెనగలూరు మండలాల్లో 58400 టన్నుల బొప్పాయిని రైతులు సాగుచేస్తున్నారన్నారు. ప్రస్తుతం 34500 టన్నులు విక్రయించగా 23900 టన్నుల పంట ఉందన్నారు. రైతులు, ట్రేడర్లు, దళారులను సమావేశ పరిచి బొప్పాయి కిలోకు రూ. 8 ధరగా నిర్ణయించారు. ధరలు తగ్గకుండా ఉండేందుకు పోలీసు, రెవెన్యూ, హార్టికల్చర్, ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.రైతులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూము కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేవమాచుపల్లిలో బొప్పాయి రైతులతో
మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీధర్