ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం

Sep 7 2025 7:36 AM | Updated on Sep 7 2025 7:36 AM

ఎన్‌ఐ

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం

రైతులను విస్మరించిన కూటమి ప్రభుత్వం

రాయచోటి : అందరికీ అన్నం పెట్టే అన్నదాతను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రావుల నరసింహారెడ్డి విమర్శించారు. శనివారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో కూటమి పాలనలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై ఆయన మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి అన్నదాత సుఖీభవ అనే పథకంతో రైతులను పూర్తిగా మోసం చేశారన్నారు. కనీసం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా అంతా చేసేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పంటలకు వేసుకునే ఎరువులు, మందుల కోసం కూడా రైతులు గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో బ్లాక్‌ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

డ్వాక్రా నిధుల స్వాహాపై

విచారణ జరపాలి

రాయచోటి టౌన్‌ : రాయచోటి పట్టణం కొత్తపేటలోని శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి డ్వాక్రా సంఘం గ్రూపునకు సంబంధించిన నిధుల స్వాహాపై విచారణ జరపాలని ప్రజా సంఘం నాయకుడు శెట్టిపల్లె సాయికుమార్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ గ్రూప్‌నకు గత ఏడాది జనవరి 11వ తేదీన రూ.12 లక్షలు రుణం మంజూరైందన్నారు. ఈ గ్రూపులో మొత్తం పది మంది ఉండాల్సి ఉండగా తొమ్మిది మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.97,000లు మాత్రమే వారి అకౌంట్‌లో జమ అయిందన్నారు. మిగిలిన రూ.3,27,000 ఏమి చేశారనే విషయమై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

దేవదాయ భూముల సర్వే

రామసముద్రం : రామసముద్రం మండలం ఆర్‌. నడింపల్లి పంచాయతీ బల్లసముద్రం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ వాలీశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములను శనివారం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. భూముల హద్దులను గుర్తించారు. సర్వే నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని ఈఓ రమణ తెలిపారు. దేవదాయశాఖకు చెందిన భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కడప ఎడ్యుకేషన్‌ : బోధన, పరిశోధన, సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన యోగి వేమన విశ్వవిద్యాలయం అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)– 2025లో యోగి వేమన విశ్వవిద్యాలయానికి 51 నుంచి 100 లోపు ర్యాంకు లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో స్టేట్‌ పబ్లిక్‌ యూనివర్సిటీస్‌ 500 పైన ఉండగా అందులో వైవీయూ 51 నుంచి వందలోపు ర్యాంకు దక్కించుకోవడం విశ్వవిద్యాలయ సమష్టి కృషికి నిదర్శనమన్నారు. 2006లో ఏర్పాటైన వైవీయూ పాత విశ్వవిద్యాలయాలైన అనంతపురం జేఎన్టీయూ, ఎస్‌కేయూ, పద్మావతి విశ్వవిద్యాలయం వంటి వాటి సరసన నిలిచిందన్నారు. వైవీయూలో రామన్‌ ఫెలోషిప్‌, డాడ్‌ ఫెలోషిప్‌ పొందిన అధ్యాపకులు పనిచేస్తున్నారని అలాగే జర్మనీ, యూకే, యూఎస్‌ లలో పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్‌ యూనివర్సిటీ పరిధిలో సెవెన్‌ స్పోక్‌ యూనివర్సిటీలను ఎంపిక చేయగా వాటిలో ఒకటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెండవది వైవీయూ కావడం గర్వకారణం అన్నారు. తద్వారా వైవీయూలో పరిశోధనకు రూ. 10 కోట్ల నిధులు రానున్నాయన్నారు. నిర్ణీత సమయంలో భారత ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ మంచి ర్యాంకులు యూనివర్సిటీ సొంతం చేసుకోవడానికి కృషి చేస్తున్న ఐక్యూ ఏసీ బృందాన్ని వీసీ అభినందించారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రిర్‌ ఆచార్య పి.పద్మ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యాలు, ప్లేస్‌మెంట్‌ పైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇంటర్నల్‌ క్వాలిటీ అసూరెన్స్‌ సెల్‌ (ఐక్యూ ఏసీ) సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.సుబ్రహ్మణ్యం శర్మ, పీఎం ఉషా సమన్వయకర్త డాక్టర్‌ టి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ 2027 నాటికి 100 ప్రాజెక్టులతో న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ కోసం పోటీ పడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఐక్యుఏసీ అసోసియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుభాష్‌ చంద్ర, సభ్యులు డాక్టర్‌ దాక్షాయని, డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు, ప్రజా సంబంధాల విభాగం సంచాలకులు డాక్టర్‌ పి. సరిత, డాక్టర్‌ కె. శ్రీనివాసరావు, డాక్టర్‌ తుమ్మలూరు.సురేష్‌ బాబు పాల్గొన్నారు.

వైవీయూ వైస్‌ చాన్సలర్‌

ఆచార్య అల్లం శ్రీనివాసరావు

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం 1
1/2

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం 2
2/2

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement