
ఎర్రచందనం దుంగల స్వాధీనం
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం గువ్వలచెరువు తూర్పు భాగంలోని కొత్తిమడుగు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు గురువారం 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఓ భరణికుమార్ మాట్లాడుతూ రాయచోటి ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు కూంబింగ్ చేపట్టినట్లు తెలిపారు. ఎర్రచందనం దుంగలు మోసుకువెళ్తున్న కూలీలు తమను చూసి పరారయ్యారన్నారు. 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వీటి బరువు సుమారు 370 కేజీలు, విలువ రూ.1.80 లక్షలు చేస్తాయని పేర్కొన్నారు. పారిపోయిన స్మగ్లర్ల జాడ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఓ రెడ్డప్ప, కొత్తిమడుగు బీట్ ప్రొటెక్షన్ వాచర్స్ రమణ, గురవయ్య, రెడ్డయ్య, శ్రీనివాసులు, కొండయ్య, జయరామ, పెద్దరెడ్డయ్య, శీను, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.