
ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణం
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో గురువారం శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణం ఘనంగా నిర్వహించారు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో రెండవ మాసం కల్యాణం మఠం ఆస్థాన ప్రధాన అర్చకుడు ఇడమటికంటి జనార్ధనాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి వారి శిష్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించి తన్మయులయ్యారు. ప్రతి నెల శుద్ధ ద్వాదశి నాడు దాతల సహకారంతో స్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్వపు మఠాధిపతి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, మఠం మేనేజర్ ఈశ్వరాచారి, పూజారులు, దాతలు పాల్గొన్నారు.