
ముగిసిన పవిత్రోత్సవాలు
నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. గురువారం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, తీర్థప్రసాద గోష్టి, పవిత్రాల వితరణ తదితర వైదిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ఊరేగించారు.భక్తులు దర్శించుకుని తరించారు. సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి: ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు, సిబ్బంది సేవలందించాలని, జిల్లాలో చిన్న తరహా నీటిపారుదల ట్యాంకుల పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, హాజరయ్యారు. ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పనులకు ఉపయోగకరంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కృత్రిమ మేధస్సు జెన్ చాట్ బాట్ ప్రాజెక్టుకు సహకరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సీపీఓను ఆదేశించారు.

ముగిసిన పవిత్రోత్సవాలు