
● గణిత భయాన్ని పోగొట్టేలా..!
విద్యార్థుల్లో గణితం అంటే ఏదో తెలియని భయం ఉంటుంది. దా నిని తొలగించి ఆసక్తి పెంచడమే లక్ష్యంగా అ డుగేశారు. అందుకు పా ఠశాల గదిని గణిత గార్డెన్‌గా మార్చేశారు. ఆయనే నామా చంద్రశేఖర్. వాల్మీకిపురం మండలం చింతపర్తి జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.పాలిజియో బోర్డు, అనలిటికల్ జా మెట్రీ బోర్డు, నంబర్ బోర్డులను స్వతహాగా తయారు చేశారు. బోర్డుల ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఏపీ మాథ్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రతి నెలా నిర్వహించే ఉచిత కంటి శిబిరానికి వచ్చే రోగులక ఉచితంగా భోజనం పెడుతున్నారు.
● 2016లో సౌత్ ఇండియా స్థాయిలో బెంగళూరులో జరిగిన మాథ్స్‌ఫోరంలో జియో పాలీబోర్డుపై ప్రథమ బహుమతి, 2023లో కడపలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో మొదటి స్థానం,2019, 24లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు.