
● బొమ్మలతో బోధన
బడిని ఆహ్లాదంగా తీర్చిదిద్దుతూ రమాభార్గవి ప్రత్యేక గుర్తింపు పొందారు. మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం జంగాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గత ఏడాది పాఠశాలలో 8 మంది విద్యార్థుఽలు ఉండగా ఆమె ప్రత్యేక దృష్టి సారించి విలేజ్‌గ్రూప్ క్రియేట్ చేసి విద్యార్థులు ప్రభుత్వ బడిల్లో చదివేలా చేశారు.ప్రస్తుతం 24 మంది విద్యార్థులున్నారు. పాఠాలను ఆటలు, బొమ్మల రూపంలో నేర్పిస్తూ విద్యార్థుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు.ఆదివారం, సెలవురోజు అంటే విద్యార్థులకు ఆనందం. కానీ ఇక్కడ మాత్రం సెలవును బడిలోనే గడిపేందుదకు ఇష్టపడతారు.రమాభార్గవి స్కౌట్స్ అండ్ గైడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. 2023,24 ల్లో ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకున్నారు.