
● ఆనందం పంచుతూ...ఆహ్లాదం పెంచుతూ...!
విద్యార్థులకు పాఠాలను బోధించడంతో పాటు పాఠశాల ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపుతున్నారు నిమ్మనపల్లె మో డల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు భాస్కరన్. చిన్నతనం నుంచే మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల, బసినికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. విద్యార్థులు ఇన్‌స్పైర్, కౌశల్ యోజన వంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో గతంలో 36 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 90 మంది ఉన్నారు.
● 2020లో గ్రీన్ స్కూల్ అవార్డును ఢిల్లీలో అందుకున్నారు. ఉత్తమ పోస్టర్ ప్రజెంటేషన్ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.జిల్లా స్థాయిలో 2022,2024లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డులు అందుకున్నారు.