
● గరువులకు గుర్తింపు
ఓబులవారిపల్లె: రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుల అవార్డుకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లి పంచాయతీ, సీఎం బలిజపల్లి గ్రామానికి చెందిన ఎలిశెట్టి ధనుంజయ,అదే మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన డాక్టర్ పోలి సాయినాథ్ రెడ్డి ఎంపికయ్యారు, ధనంజయ కడప జిల్లా వేంపల్లె ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గణిత అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. ఈయన రాయలసీమ ప్రాంతం నుంచి సీనియర్ లెక్చరర్ విభాగంలో అవార్డు పొందారు. సాయినాథ్‌రెడ్డి నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. ఐఐటీ మద్రాసులో ఎంటెక్ చదివారు. జేఎన్‌టీయూ అనంతపురంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.వీరికి అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
ఎలిశెట్టి ధనుంజయ
పోలి సాయినాథ్ రెడ్డి

● గరువులకు గుర్తింపు