
● నరేష్.. క్రీడాకారులకు స్ఫూర్తి
మారుమూల గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారిని క్రీడల్లో కుసుమాలుగా తయారు చేస్తున్నారు మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ నరేష్. 2010లో ఫిజికల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలోని గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడపట్ల ఆసక్తి పెంచేలా చేశారు. పాఠశాలలో ప్రత్యేకంగా క్రీడామైదానం ఏర్పాటు చేయించారు. విద్యార్థులను ఉదయం,సాయంత్రం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా హాకీ, పుట్‌బాల్, క్రికెట్,అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి ఏడాది వేసవిలో ఉచిత వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు జిల్లా, రాష్ర, జాతీయ స్థాయిల్లో ఎంపికయ్యారు. 2023–24, 2024–25 సంవత్సరాలకు సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల బెస్ట్ స్పోర్టు ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికై ంది. 2017లో ఉత్తమ జిల్లా అవార్డు, 2023 హిందూ ఉపాధ్యాయ సంఘంచే రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.