
టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో వర్గపోరు
పెనగలూరు : తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి సంస్థాగత ఎన్నికలు మంగళవారం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పోటాపోటీగా జరిగాయి. పలు పంచాయతీల నుంచి విశ్వనాథ నాయుడు వర్గీయులు ఓవైపు, రూపానందరెడ్డి వర్గీయులు మరో వైపు తమకే పదవులు కావాలంటూ పోటీ పడ్డారు. మండల పరిశీలకుడు శ్రీనాథ్ రెడ్డి ఒక్కో పంచాయతీ సభ్యుడిని పిలిపించి వారి మనోగతాన్ని తెలుసుకొని ఇరువర్గాల నుంచి పేర్లను సేకరించారు. మండలంలో 16 పంచాయతీలు ఉండగా ఐదు, ఆరు పంచాయతీలు మినహా మిగిలిన అన్ని పంచాయతీలలో విశ్వనాథ నాయుడు వర్గం, రూపానందరెడ్డి వర్గీయులు తమకే పదవులు కావాలని పట్టుబట్టారు. దీంతో ఎస్‌ఐ రవిప్రకాష్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యగా బయట ప్రాంతం నుంచి పోలీసు బలగాలను రప్పించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడి పదవికి కూడా రెండు వర్గాల మధ్య పోటాపోటీ నెలకొంది.
భారీగా పోలీసు బందోబస్తు