
●విద్యాపరంగా అభివృద్ధి
రాయచోటిలో వైఎస్సార్ పాలన చేపట్టిన తర్వాత రూ. 150 కోట్లతో రాయచోటిలో 5 మోడల్ పాఠశాలలను మంజూరు చేయడంతో పాటు వాటికి భవనాలను నిర్మించి ఇచ్చారు. రైల్వేకోడూరుకు సంబంధించి ప్రత్యేకంగా వైఎస్సార్ ఉద్యాన కళాశాల, ఓబులవారిపల్లెలో పాలిటెక్నిక్ కళాశాలను అందించారు. వైఎస్‌ఆర్ హయాంలోనే కోర్టు భవనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలో ఎన్నో బాలుర, బాలికల విద్యాలయాలు, కేజీబీవీలు నెలకొల్పి విద్యకు పెద్దపీట వేశారు.
సాక్షి రాయచోటి : రాజన్న...ఈ మాట ఉచ్ఛరిస్తేనే జనాలకు ఒక భరోసా. ఇంట్లో ఏది జరిగినా నీకు నేనున్నానంటూ ఆయన అందించిన విశ్వాసం కుటుంబంలో నేటికీ శాశ్వతం. ప్రత్యేకించి అందుకు కారణం రాజకీయాలకు అతీతంగా పేదల్ని ప్రేమించడం, వర్గాలకు అతీతంగా సంక్షేమ పాలన అందించడం. చెరగని చిరునవ్వుతో...తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు....నడకలో రాజసం....నమ్ముకున్న వారిని ఆదరించే గుణం...మాట తప్పని మడమ తిప్పని నైజం...కార్మికులు, కర్షకుల కోసం పరితపించే గుణం...ఈ లక్షణాలన్నీ కలగలిపిన ఏకై క నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజానీకంతోపాటు ప్రపంచ తెలుగు ప్రజలకు సుపరిచితుడు. రాష్ట్ర ప్రజల కోసం, ఎంతటి కష్టాన్నైనా భరించారు. చెప్పిన మాట ఆచరించేందుకు రచ్చబండ నిర్వహణ కోసం పయనించిన ఆయన 2009 సెప్టెంబరు 2న హెలికాప్లర్ దుర్ఘటనలో మృత్యువాతపడ్డారు. నేడు వైఎస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
మారిన జిల్లా స్వరూపం
డాక్టర్ వైఎస్సార్ రాకతో రాయచోటి రూపురేఖలు మారాయి. రహదారుల నిర్మాణం, విద్యాభివృద్ధికి కళాశాలలు మంజూరు, సాగునీటి ప్రాజెక్టులు, పక్కాగృహాలు ఇలా చెబుతూపోతే ప్రతి విభాగంలోనూ వైఎస్సార్ ముద్ర కనిపిస్తుంది. అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని పీలేరులో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, జిల్లాలో లక్షకుపైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పేరెన్నికగన్న విద్యా సంస్థల ఏర్పాటు, వేలాదిమందికి రేషన్‌కార్డులతోపాటు పింఛన్లతో జిల్లాపై డాక్టర్ వైఎస్సార్ చెరగని ముద్ర వేశారు.
సొంత భూమిని దానం చేసి...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన సొంత భూమిని కూడా పేద ప్రజలకు పంచి పెట్టి వారి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరులో 2007లో తన సొంత భూమి 304 ఎకరాలను 108 మంది ఎస్టీ కుటుంబాలకు అప్పటి ఎమ్మెల్యే ప్రభావతమ్మతో కలిసి స్వయంగా పంపిణీ చేసారు. ప్రస్తుతం ఆ భూముల్లో గిరిజనులు పంటలు పండించుకుంటూ జీవనాధారం పొందుతున్నారు. రాజంపేట–రాయచోటి మార్గంలో చెయ్యేరు నది సమస్య లేకుండా నదిపై రూ.7 కోట్లతో బాలరాచపల్లె వంతెన నిర్మాణం జరిగింది. రాజంపేట పంచాయతీని మున్సిపాలిటీగా మార్పు చేయించారు. వైఎస్ పాలనలో రూ.100కోట్లపైగా నిధులు విడుదలయ్యాయి. వ్యవసాయ పరంగా రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాలతో రైతుల్లో చెరగని ముద్ర వేసిన ఆరోగ్యశ్రీ, 108 పథకాల ద్వారా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.
కళ్లముందు సాక్షాత్కరించిన సాగునీటి ప్రాజెక్టులు
వైఎస్సార్ హాయంలో తొలి జలయజ్ఙం ప్రాజెక్టు వెలిగల్లు. దివంగత ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని శరవేగంగా పూర్తి చేసుకున్న వెలిగల్లు ప్రాజెక్టును తొలి జలయజ్ఙం ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి హోదాలో 2008 డిసెంబరు 24వ తేదీన జాతికి అంకితం చేశారు. 4.64 టిఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు కోసం 300 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీటిని అందించనుంది.
ఝరికోన ప్రాజెక్టు పూర్తి
బ్రిటీష్ కాలం నుంచి ప్రచారంలో ఉన్న ఝరికోన ప్రాజెక్టు వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే రూపకల్పన దాల్చుకుంది. చిత్తూరు జిలా సరిహద్దు ప్రాంతంలోని ఝరికోన వద్ద 7 టిఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. దీని ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. అలాగే పీలేరు నియోజకవర్గంలోని అడవిపల్లె రిజర్వాయర్‌ను 2.50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. 5 మండలాలకు తాగు, సాగునీరే ధ్యేయంగా శ్రీనివాసపురం(నాగిరెడ్డి) రిజర్వాయర్ హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంగా 308 కోట్ల రూపాయలతో 1.25 టిఎంసీల సామర్థ్యంతో చిన్నమండెం మండల కేంద్రం సమీపంలో నిర్మించారు. అలాగే మదనపల్లెలో హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ పనులకు రూ. 4200 కోట్ల మంజూరుకు చర్యలు చేపట్టారు. రాజంపేటలో సుమారు రూ. 30 కోట్లతో మున్సిపాలిటీకితాగునీటి సమస్య తీర్చేందుకు అన్నమయ్య భారీ తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారు.
అనంతరాజుపేట వద్ద ఏర్పాటు చేసిన
వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ
వెలిగల్లు, ఝరికోన ప్రాజెక్టులు పూర్తి
రైల్వేకోడూరులో
ఉద్యాన కళాశాల ఏర్పాటు
రాయచోటిలో రింగ్‌రోడ్డు..
అడవిపల్లె ప్రాజెక్టులు
వైఎస్సార్ హయాంలో
పరుగులు తీసిన అభివృద్ది
నేడు వైఎస్సార్ 16వ వర్ధంతి

●విద్యాపరంగా అభివృద్ధి

●విద్యాపరంగా అభివృద్ధి

●విద్యాపరంగా అభివృద్ధి