
వైభవంగా పల్లకీసేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీలో ఊరేగారు. సోమవారం రాత్రి మూల విరాట్‌లను ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి, కృష్ణయ్య స్వామి, శేఖర్ స్వామి, రాచరాయ యోగీ స్వామి, మల్లిఖార్జున స్వామి రంగు రంగుల పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. పురవీధులలో ఊరేగించారు. ఆలయ ఈవో టీవీరమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు
తైక్వాండోలో బంగారు పతకం
సిద్దవటం : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో నిర్వహించిన రాయలసీమ స్థాయి తైక్వాండో పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా, సిద్దవటం మండలం విద్యార్థికి బంగారు పతకం లభించింది. ఎస్ రాజంపేట గ్రామం, ఎస్సీ కాలనీలో నివాసముంటున్న భవనాసి సుశాంత్ ఆరో తరగతి చదువుతున్నాడు.సోమవారం జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరించి బంగారు పతకం సాధించాడు. సుశాంత్ బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉందని తండ్రి బి.మునయ్య పేర్కొన్నారు
జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్
రాయచోటి : జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూరియా కొరతపై వస్తునన వదంతులను రైతులు నమ్మవద్దని అన్నారు. పీలేరులో యూరియా కొరత ఉందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు.

తైక్వాండోలో బంగారు పతకం