
సీజన్స్ ట్రోఫీ సాధించిన సీటీఎం క్రాస్‌రోడ్స్ టీం
మదనపల్లె రూరల్ : రెండురోజులుగా జరుగుతున్న సెకండ్ సీజన్ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ పోటీల్లో సీటీఎం క్రాస్‌రోడ్ టీం విన్నర్‌గా నిలిచింది. ఆదివారం సీటీఎం క్రాస్‌రోడ్ టీం కెప్టెన్ అనిల్‌కు, మైఫోర్స్ మహేష్ విన్నర్స్ ట్రోఫీని అందించారు. రన్నర్‌గా నిలిచిన ముదివేడు దిన్నెమీదపల్లె టీంకు కేఎస్‌ఎన్.నూర్ బాబా బహుమతిని అందించారు. హోరాహోరీగా జరిగిన సెకండ్ సీజన్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ పోటీల్లో మొదటి 15 ఓవర్లకు సీటీఎం క్రాస్‌రోడ్ టీం 121 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ముదివేడు దిన్నెమీదపల్లె టీం 110 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అనిల్, హరిబాబులను అభినందించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఈసీసీ క్లబ్ డైరెక్టర్ హరిబాబు, వినయ్, దేవేంద్ర, గంగరాజు, మోని, మధు తదితరులు పాల్గొన్నారు.