
అంగళ్లు చెరువులో భవన నిర్మాణ మేసీ్త్ర మృతి
కురబలకోట : వినాయక నిమజ్జనంలో ఓ వ్యక్తి చెరువులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన విషాదకర సంఘటన కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు ప్రాంతం మోదుగులపల్లెకు చెందిన మేసీ్త్ర దేవేంద్ర అలియాస్ నాగేంద్ర (35)కు భార్యా పిల్లలు ఉన్నారు. ఇతను కురబలకోట మండలం అంగళ్లులోని ఓ మహిళతో ఐదేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మండలంలోని చిన్నతట్టివారిపల్లె గ్రామస్తులు గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆనందంగా పాల్గొన్న ఇతను సమీపంలోని మల్లేశ్వరం చెరువు వరకు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిమజ్జన సమయంలో చెరువులో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. చీకటి కావడంతో అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. ఆదివారం ఉదయం చెరువులో శవమై కన్పించాడు. మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్తాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెరువులో పడి మృతి చెందడం పట్ల అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి
సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
పులివెందుల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఈనెల 2వ తేదీన మంగళవారం ఉద యం 6.30 గంటలకు స్థానిక భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. వైఎస్సార్‌కు ఘనంగా నివాళి అర్పించే కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, కుల సంఘాల, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పులివెందుల ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విద్యుత్ షాక్‌తో బర్రె మృతి
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం బాలుపల్లి నుంచి గోపులాపురం వెళ్లే దారిలో విద్యుత్ షాక్‌తో బర్రె మృతి చెందింది. బాలుపల్లి గ్రామానికి చెందిన బొమ్మేపల్లె నారాయణమ్మ పశువులను మేపుతుండగా రోడ్డు పక్కగా ఉన్న విద్యుత్ స్తంభం వద్ద బర్రెకు, నారాయణమ్మకు విద్యుత్ షాక్ తగిలింది. బర్రె మృతి చెందగా, నారాయణమ్మ స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. సమీపంలోని గ్రామస్తులు స్పందించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నారాయణమ్మను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన బర్రె సుమారు లక్ష రూపాయలు పైగా విలువ చేస్తుందని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపించారు.

అంగళ్లు చెరువులో భవన నిర్మాణ మేసీ్త్ర మృతి