
ప్రజలకు అందుబాటులో నాణ్యమైన ఇంధనం
కలికిరి : ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందించడమే లక్ష్యంగా కలికిరిలో పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చినట్లు కర్నూలు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. కలికిరి పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన ఐఓసీఎల్ పెట్రో ఫిల్లింగ్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. పోలీసులతో పాటు ప్రజలకు కూడా ఈ ఫిల్లింగ్ స్టేషన్‌తో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ క్రిష్ణమోహన్, ఐఓసీఎల్ సేల్స్ అధికారి వాసు. ఎంవీఐ ఎం.పెద్దయ్య, కలికిరి సీఐ అనిల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
వివాహిత ఆత్మహత్య
రాయచోటి : రాయచోటి పట్టణం పీటీఎం పల్లెకు చెందిన నందిని(36) ఆదివారం ఉదయం అమ్మగారి ఇంటిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 15 సంవత్సరాల కిందట సంబేపల్లి మండలం, రైతుకుంట గ్రామం, పోతువాండ్లపల్లి దళితవాడకు చెందిన బరుగు శివ కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. బరుగు నందిని ప్రతిరోజు కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు, అయితే గత కొద్దిరోజులుగా నందిని భర్త అనుమానంతో ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని సమాచారం. శనివారం సాయంత్రం భార్యాభర్తలిద్దరూ గొడవపడి నందినిని రాయచోటి పట్టణం పూలతోట దళితవాడలోని అమ్మగారి ఇంటి వద్ద వదిలేసి తిరిగి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో బరుగు నందిని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్