
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
రాజంపేట రూరల్ : రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్రయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయం ఎదుట ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు సోమవారం పర్యటనలో ప్రకటించాలన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ.సికిందర్, కార్మిక నాయకులు మహమ్మద్ హుస్సేన్, వేముల నరసింహులు, కాయల రమణ, వేంకప్ప, జీ రమణ, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.