ఎక్సలెన్స్‌ బడులు | - | Sakshi
Sakshi News home page

ఎక్సలెన్స్‌ బడులు

Sep 1 2025 2:49 AM | Updated on Sep 1 2025 2:49 AM

ఎక్సల

ఎక్సలెన్స్‌ బడులు

ఆటలే పాఠాలు... పోటీలే పరీక్షలు..పతకాలే ఫలితాలు

సర్కారు బడుల్లో క్రీడా వికాసం

స్పోర్ట్సు ఎక్స్‌లెన్స్‌ అవార్డులకు ఎంపిక

మదనపల్లె సిటీ: చిన్నారులకు సమగ్ర వికాసానికి చదువుతో ఆటపాటలూ అవసరమనేది అక్షర సత్యం. మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యమిస్తున్న ఈ కాలంలో ఉదయం నుంచి రాత్రి వరకు తరగతి గదుల్లోనే బాల్యం మగ్గిపోతోంది. ఎక్కువ శాతం పాఠశాలల్లో ఆటపాటలకు చోటే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మదనపల్లె రూరల్‌ మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల, మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలు క్రీడల్లో తమదైన ముద్ర వేస్తున్నాయి. చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులతో నిత్యం సాధన చేయిస్తున్నారు. ఈ పాఠశాలల్లో తర్పీదు పొందిన వారు జిల్లా, రారష్ట్‌ర స్థాయి జట్టుకు ఎంపికవుతూ సత్తా చాటుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ ఏడాది సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలకు మొదటి ర్యాంకుతో బెస్ట్‌ స్పోర్ట్సు ఎక్స్‌లెన్సీ అవార్డు–2024–25 ఎంపిక చేశారు. అలాగే మదనపల్లెలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మూడవ ర్యాంకు సాధించి బెస్ట్‌ స్పోర్ట్సు ఎక్స్‌లెన్సీ అవార్డు దక్కించుకుంది. అవార్డులను సెప్టెంబర్‌ 5వతేదీ ఉపాధ్యాయ దినోత్సవం రోజున అందజేయనున్నారు.

ముందంజలో జెడ్పీ క్రీడాకారులు:

ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాకారులు ముందజలో ఉన్నారు. ప్రధానంగా నెట్‌బాల్‌,హాకీ, బాల్‌బ్యాడ్మింటన్‌, త్రోబాల్‌, హ్యాండ్‌బాల్‌ క్రీడల్లో రాణిస్తున్నారు.

● మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాకారులు రోప్‌స్కిప్పింగ్‌, పుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, రెజ్లింగ్‌, కరాటే, అథ్లెటిక్స్‌ విభాగాల్లో రాణిస్తున్నారు. ఈ ఏడాది పాఠశాల నుంచి 60 మంది క్రీడాకారులు తొమ్మిది అంశాల్లో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. ముగ్గురు జాతీయ స్థాయి పోటీలకు, 44 మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు మొదటి ర్యాంకు ప్రకటించారు. గత ఏడాది కూడా మొదటి స్థానం దక్కించుకున్నారు.

మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలకు

తృతీయ స్థానం:

మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఈ ఏడాది 24–25 సంవత్సరానికి మూడవ ర్యాంకు సాధించారు. పాఠశాలలో రోప్‌స్కిప్పింగ్‌లో జాతీయ,రాష్ట్ర స్థాయిల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. దీంతోపాటు హాకీ, పుట్‌బాల్‌, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారు.గత 23–24 అయిదవ స్థానం వచ్చింది. 22–23 లో మొదటి స్థానం వచ్చింది.

మూడవ స్థానం దక్కించుకున్న మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల

హాకీ ఆడుతున్న సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాకారులు

పాఠశాలకు గుర్తింపు

స్పోర్ట్సు ఎక్స్‌లెన్సీ అవార్డు రావడంతో పాఠశాలకు మంచి గుర్తింపు వచ్చింది. పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడానికి వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదు ఇచ్చారు. చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. –చంద్రశేఖర్‌,హెచ్‌ఎం, సీటీఎం జడ్పీహెచ్‌ఎస్‌

క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ

క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. హెచ్‌ఎం సుబ్బారెడ్డి సహకారంతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు నైపు ణ్యం సాధించి ప్రతిభ కనబరుస్తున్నారు. మూడవ స్థానం రావ డం సంతోషంగా ఉంది. –దేవకమ్మ, పీడీ, జెడ్పీహెచ్‌ఎస్‌, మదనపల్లె

జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు

పాఠశాలలో మెరికల్లాంటి క్రీడాకారులున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో ప్రతిభను కనబరుస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం రావ డం సంతోషంగా ఉంది. –నాగరాజు పీడీ, సీటీఎం, జెడ్పీహెచ్‌ఎస్‌

ఎక్సలెన్స్‌ బడులు 1
1/5

ఎక్సలెన్స్‌ బడులు

ఎక్సలెన్స్‌ బడులు 2
2/5

ఎక్సలెన్స్‌ బడులు

ఎక్సలెన్స్‌ బడులు 3
3/5

ఎక్సలెన్స్‌ బడులు

ఎక్సలెన్స్‌ బడులు 4
4/5

ఎక్సలెన్స్‌ బడులు

ఎక్సలెన్స్‌ బడులు 5
5/5

ఎక్సలెన్స్‌ బడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement