
నేటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
నేడు రాజంపేటకు ముఖ్యమంత్రి రాక
రాజంపేట: నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. పర్యటనకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు అనుగుణంగా వేదిక నిర్మాణం, పాల్గొనే లబ్ధిదారులు కూర్చవడానికి అవసరమైన సదుపాయాలు, తాగునీటి వసతి, శానిటేషన్, పార్కింగ్ సంబంధిత ఏర్పాట్లన్నీ పూర్తి అయినట్లు తెలిపారు. ఎటువంటి లోపాలు లేకుండా అధికార బృందాలు సకాలంలో పనులు పూర్తి చేసారన్నారు. సీఎం స్వయంగా పలుకురించబోయే రజక లబ్ధిదారుల జాబితా, వారికి అందించేబోయే ప్రయోజనాలు, సౌకర్యాలు క్షుణ్ణంగా సమీక్షిస్తారన్నారు. సమావేశానికి హాజరైయ్యే ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వేదిక పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పబ్లిక్ అండ్ సిస్టమ్, సీసీ కెమరాలు, క్షేత్రస్ధాయి భధత్రా బలగాలను విస్తృతంగా మోహరించామన్నారు. పర్యటన ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌తో పాటు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, ఎఎస్పీ వెంకటాద్రి జెసీ ఆదర్శరాజేంద్రన్, సబ్‌కలెక్టర్ భావన, మదనపల్లె సబ్‌కలెక్టర్ చల్లా కల్యాణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
సోమవారం ఉదయం 11.50 గంటలకు రాజంపేట మండలంలోని మన్నూరులోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.15 గంటలకు పెద్దకారంపల్లెకు చేరుకుంటారు. ఫించన్ లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అవుతారు. బోయనపల్లెలని దోబిఘాట్ వద్ద రజకులతో సీఎం భేటి అవుతారు. 1.15 గంటలకు ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడే ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హెలిప్యాడ్ చేరుకొని తిరుగుపయనం అవుతారు.
పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి మూడు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 1.30గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి బయలుదేరి జక్కూరు ఎయిర్‌డ్రోంకు 1.50గంటలకు చేరుకుంటారు. 2గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 2,.50గంటలకు పులివెందులలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 2.55గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 3.గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు. 3 నుంచి రాత్రి 7.30 వరకు క్యాంపు ఆఫీస్‌లో ప్రజలతో మమేకం కానున్నారు. 7.30కి క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి 7.35కు తన నివాసానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా ఉదయం 6.45గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన నేరుగా ఇడుపులపాయకు బయలుదేరతారు. 7.15గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ఉదయం 7.15గంటల నుంచి 8గంటలవరకు వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్సార్‌కు నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 8గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం అంబకపల్లె గ్రామానికి బయలుదేరుతారు. 10.30గంటలకు అంబకపల్లెకు చేరుకుంటారు. 10.30 నుంచి 11.30 వరకు అంబకపల్లె గ్రామంలోని గంగమ్మ కుంట చెరువు వద్ద నీటికి జలహారతి ఇవ్వనున్నారు. 11.30కి అంబకపల్లె గ్రామం నుంచి బయలుదేరి 12.30కి పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు. 2.25కు తన నివాసం నుంచి బయలుదేరి 2.30కి భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2.30 నుంచి 7.25 వరకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో ఆయన మమేకం కానున్నారు. 7.30కి భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే ఆయన బస చేయనున్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 7గంటలకు భాకరాపురంలోని తన నివాసం నుంచి బయలుదేరి 7.05గంటలకు అదే ప్రాంతంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 7.15కు హెలీక్టాపర్ ద్వారా బెంగుళూరుకు బయలుదేరుతారు. 8.30గంటలకు యలహంకలో ఉన్న తన నివాసానికి చేరుకుంటారు.
2న ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళి, ప్రత్యేక ప్రార్థనలు

నేటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన