
పార్వతీ తనయా.. పాహిమాం
పీలేరులో గణనాథుడి విగ్రహానికి హారతి
పీలేరు/రాయచోటి: ఐదు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు ఆదివారం గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లా వ్యాప్తంగా 1500 విగ్ర హాలను నిమజ్జనానికి తరలించారు.డప్పుచప్పుళ్లు, మేళాతాళాల మధ్య భక్తులు గణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంబర్ల ప్రకారం వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు.
● పీలేరు పట్టణంలో గణేష్ నిమజ్జన సంబరాలు అంబరాన్నంటాయి. గణేష్ విగ్రహాలను ఆదివారం అంగరంగవైభంగా నిమజ్జనం చేశారు. ఉదయం 10 గంటల నుంచే పట్టణంలో ఊరేగింపు కార్యక్రమం మొదలైంది. స్థానిక నెహ్రూబజార్‌లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు ప్రారంభించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం సమీపంలో ఊరేగింపుగా వచ్చిన విగ్రహాలకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు.
అట్టహాసంగా గణేష్ నిమజ్జన సంబరాలు
పీలేరు పట్టణంలో భారీ ఊరేగింపు
సాంస్కృతిక కార్యక్రమాలతో పులకించిన పీలేరు

పార్వతీ తనయా.. పాహిమాం

పార్వతీ తనయా.. పాహిమాం

పార్వతీ తనయా.. పాహిమాం