
పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు
రాయచోటి: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న పబ్లిక్ గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజంపేటలో సీఎం పర్యటన నేపథ్యంలో గ్రీవెన్స్ సెల్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావద్దని కోరారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తులు కరుణించమ్మా అంటూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆదివారం ఆలయంలో అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించి వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. పలువురు తలనీలాలు సమర్పించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నిర్వహించిన రాయలసీమ స్థాయి తైక్వాండో పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారని జిల్లా తైక్వాండో వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, కార్యదర్శి విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. మాస్టర్ రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో వేదాష్, కె. భాను చేతన్ రెడ్డి, జితేష్ రెడ్డి, రెడ్డెమ్మ, చరణ్ సాయి, హేమశ్రీ స్వర్ణపతకాలు కై వసం చేసుకున్నారన్నారు. మణికంఠ రజత పతకం, సుషాత్, వర్షిత్, నాగ చైతన్య గౌడ్, సాజియా, వైష్ణవి, నవ్యశ్రీ, కీర్తి, మౌనిష్, మోక్షిత్, హర్షవర్దన్ రెడ్డి కాంస్యపతకాలు సాధించారని చెప్పారు.

పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు