
జిల్లా కోసం అన్నమయ్యకు వినతిపత్రం
రాజంపేట : రాజంపేటను జిల్లా చేయాలంటూ జిల్లా సాధనసమితి జెఎసీ ఆధ్వర్యంలో పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులకు వినతిపత్రం అందజేసే విధంగా వినూత్న నిరసన శుక్రవారం చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న జిల్లా కోసం ఉద్యమంను బలోపేత దిశగా తీసుకెళతామని జెఎసీనేతలు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందుగా రాజంపేటకు వచ్చిన సందర్భంగా చేసిన జిల్లా ప్రకటన వాగ్దానంను అమలుచేయాల్సిన బాధ్యత ఆయనకు ఉందన్నారు. మెడికల్ కాలేజీ ఇస్తాను, అన్నమయ్య జలాశయాన్ని నిర్మితం చేస్తామన్న హామీలను ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. రాజంపేటకు వస్తున్న ముఖ్యమంత్రికి మరోసారి జిల్లా ప్రకటన అంశాన్ని గుర్తుచేస్తామన్నారు. కార్యక్రమంలో జెఎసీ నేతలు పూలభాస్కర్, ఉద్దండం సుబ్రమణ్యం, పోకల ప్రభాకర్,ఆస్లాంషేక్, న్యాయవాది నాసరుద్దీన్, కత్తి సుబ్బరాయుడు, అబుబకర్, కరీం, అదృష్టదీపుడు, మోహన్, నారా శివకుమార్‌నాయుడు,బుజ్జి, రామచంద్రరాజు, జయచంద్ర, మహదేవయ్య, టీచర్ రమణనాయుడు పాల్గొన్నారు.
జిల్లా కోసం పోస్టుకార్డుల ఉద్యమం..
రాజంపేటను జిల్లా చేయాలని శుక్రవారం రాజంపేట పోస్టుకార్డుల ఉద్యమంను చేపట్టారు. 4వేల కార్డులను సీఎం, డిప్యూటీ సీఎం, డిలీమిటేషన్ కమిటీ మంత్రులకు పంపారు. రాజంపేట ప్రధాన తపాలాకార్యాలయం పోస్టల్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణకు పోస్టుకార్డులను అందజేశారు. కార్యక్రమంలో జెఎసీ కమిటి కన్వీనరు లక్ష్మీనారాయణ, ఏపీరోడ్డు డెవలప్‌మెంట్ మాజీ డైరక్టరు గండికోట గుల్జార్‌బాష,,ప్రైవేటు పాఠశాల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌నాయుడు, కమిటి నేతలు బాసినేని వెంకటేశ్వర్ల నాయుడు, మాజీ కౌన్సిలర్ మీసాల వెంకటసుబ్బయ్య, న్యాయవాది నాసరుద్దీన్, రమేష్‌నాయుడు,సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.