
కార్మికులను రెగ్యులరైజ్ చేయండి
మదనపల్లె : రాష్ట్రంలో థర్ట్‌పార్టీ విధానంలో విద్యుత్‌శాఖలో పని చేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోషియేషన్–3045 రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిస్కం, ట్రాన్స్‌కో, జెన్కోలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కాంట్రాక్టు కార్మికులను అక్కడి ప్రభుత్వాలు రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాయని అన్నారు. దీనికి సంబంధించి వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల వివాదాల పరిష్కార చట్టం శాశ్వత అవసరాల పనుల్లో కాంట్రాక్టు విధానం కొనసాగించరాదని స్పష్టంగా చెబుతోందన్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు హామీలు ఇచ్చినప్పటికి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం జరిగేలా రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సమావేశంలో డివిజన్ల అధ్యక్షులు యశ్వంత్, భాస్కర, కళ్యాణ్, రాజుకుమార్, ఎం,చంద్ర, గంగాధర్, వేణు, సాంబ, కిరణ్ పాల్గొన్నారు.