
విద్యా ప్రమాణాలు పెంపొందించాలి
పీలేరురూరల్ : మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని ఆ పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ పి. మాధవీలత అన్నారు. శుక్రవారం స్థానిక చిత్తూరు రోడ్డు మార్గంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులుపై ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేవించారు. అనంతరం విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడుతూ విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలన్నారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలు బాగా వచ్చాయని అభినందించారు. ఈ ఏడాది కూడా ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాధారాణి, ఉపాధ్యాయులు పుష్పలత, సునీత, కవిత, శోభారాణి, రేవతి, అనీషా, సఫూరా, విద్యార్థినులు పాల్గొన్నారు.