
‘జవహర్ నవోదయ’లో మార్పులకు అవకాశం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గురువారం ఉదయం పూర్ణాహుతితో ధ్వజస్తంభ జీర్ణోధరణ శాస్త్రోక్తంగా ముగిసింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేలుకొల్పి అర్చన జరిపారు. ఉదయం 9 గంటలకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, వాస్తుహోమం, కుంభస్థాపన, సయ్యాదివాసం, తత్వహోమాలు, పూర్ణాహుతి కళాకర్షణ జరిపారు. ఈనెల 27న సాయంత్రం ఆరుగంటలకు ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు అంకురార్పణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్ పాల్గొన్నారు.