
అధ్వానంగా ఆంధ్రా ఊటీ ఘాట్‌రోడ్డు
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రమైన ఆంధ్రాఊటీ హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డు ఆధ్వానంగా తయారైంది. ఎగిరిపోయిన తారు, గుంతలు, మధ్యలో చీలిన రోడ్డు ఇలా దరిద్రంగా మారిన ఘాట్‌రోడ్డుతో పర్యాటకులు అసహనానికి గురవుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వీవీఐపీలు, మంత్రులు, ప్రభుత్వ స్థాయి వ్యక్తులు ఇక్కడికి వచ్చి విడిదిచేసి వెళ్తుంటారు. ఘాట్‌రోడ్డు బాగుంటే రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండటమే కాకుండా ప్రమాదాలను అరికట్టే వీలుంటుంది. అయితే ప్రభుత్వం ముఖ్యమైన పర్యాటక కేంద్రానికి వెళ్లే ఘాట్‌రోడ్డుపై నిర్లక్ష్యం చూపుతోంది. జిడ్డు కృష్ణమూర్తి సర్కిల్‌లో రహదారిపై పొడవుగా నిలువునా చీలినట్టు గంతలు పడ్డాయి. ఇటీవల కొండపై జరిగిన అభివృద్ధి పనుల కోసం రోడ్డును తవ్వేశారు. దీనిని అభివృద్ధి చేయలేదు. దీనిపై రాకపోకలు సాగించే బైక్‌లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఘాట్‌రోడ్డుపై పలుచోట్ల తారు లేచింది. రహదారి భవనాలశాఖ అధికారులు రోడ్లు మరమ్మతులు చేయించడంతోపాటు ఘాట్‌రోడ్డుపై కొత్త రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.

అధ్వానంగా ఆంధ్రా ఊటీ ఘాట్‌రోడ్డు