
సెప్టెంబరు1న రాజంపేటకు ముఖ్యమంత్రి రాక
రాజంపేట: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు1న రాజంపేటకు రానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం సభ, హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. లబ్ధిదారులకు ఫించన్ల పంపిణీ సభలో సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలో సమావేశం కానున్నారు. బోయనపల్లె, ఎంజీపురం, ఊటుకూరు, కూచివారిపల్లె పంచాయతీలోని ఎన్టీఆర్ కాలనీ, ప్రభుత్వ జూనియన్ కళాశాల, సీటీ కల్యాణమండపం వద్ద ఉన్న స్థలాన్ని , తోట కల్యాణ మండపాన్ని , బోయనపల్లె ప్రభుత్వ హైస్కూల్ క్రీడామైదానాన్ని పరిశీలించారు. సీఎంఓ భద్రత సిబ్బంది రాజంపేటకు చేరుకొని సభా స్థలాన్ని, హెలిప్యాడ్ ఖరారు చేసి సీఎం షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్‌కలెక్టర్ భావన , ఎఎస్పీ మనోజ్‌రామ్‌నాథ్ హెగ్డే, క్షత్రియ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ అద్దెపల్లె ప్రతాప్‌రాజు, తాళ్లపాకు చెందిన ఉద్దండం సుబ్రమణ్యం, శివనారాయణచౌదరి, అదృష్టదీపుడు, తహసీల్దారు పీరుమున్నీ, ఎంపీడీఓ వరప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఈఈ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గురువారం సబ్‌కలెక్టర్ భావన సభాస్థలిని పరిశీలించారు.