
వ్యాపార సౌలభ్యానికి చేయూత
రాయచోటి: సులభతర వ్యాపారంపై భారత ప్రభుత్వం నిర్వహించే సర్వేలో సానుకూల స్పందన వల్ల జిల్లాకు మరిన్ని పెట్టుబడులు సాధ్యమని, ఇందుకు జిల్లా యంత్రాంగం చేయూతనందిస్తుందని మదనపల్లె సబ్ కలెక్టర్ కళ్యాణి పేర్కొన్నారు. గురువారం రాయచోటి కలెక్టరేలోని పీజీఆర్‌ఎస్ హాల్లో మదనపల్లె సబ్ కలెక్టర్ అధ్యక్షతన బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2024 అవుట్ రీచ్ కార్యక్రమాన్ని జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తూ, దేశవ్యాప్తంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానాన్ని సాధించిందని గుర్తు చేశారు. జిల్లా పరిశ్రమల అధికారి కె.కృష్ణకిశోర్, కేపీఎంజీ ప్రతినిది రవితేజలు జరుగుతున్న బిఆర్‌ఏపీ 2024లో 453 సంస్కరణలు అమలు తదితర వాటిపై వివరించారు. కార్యక్రమంలో పరిశ్రమ సంఘాలు, సింగిల్ డెస్క్ యూజర్స్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.