
ప్లేస్‌మెంట్ వ్యూహాలు కేరీర్ విజయానికి కీలకం
కురబలకోట : ప్లేస్‌మెంట్ వ్యూహాలు కేరీర్ విజయానికి కీలకమని టాలెంట్ ఉన్న వారికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉందని పుణెలోని అరిష్ట నెట్‌వర్క్స్ ఇండియా క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు మోదీన్ రశీష్ అన్నారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో రియల్ వరల్డ్ ప్లేస్‌మెంట్ స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్ అంశంపై శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదువు పూర్తయ్యాక జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమన్నారు. ముందుగా కంపెనీ సమాచారాన్ని అధ్యయనం చేసి ఉండాలన్నారు. ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పాలన్నారు. ఇందుకు సబ్జక్టుపై పట్టు ఉండాలన్నారు. బాడీ లాంగ్వేజ్ కూడా ముఖ్యమన్నారు. ముఖ్యంగా రెజ్యూమ్ అనేది పకడ్బందీగా ఉండాలన్నారు. ఇది అవకాశాలను తెరిచే తాళం లాంటిదని గుర్తించాలన్నారు.
వేరుశనగ సాగులో
అనుబంధ పంటలు
రాయచోటి టౌన్ : వేరుశనగ సాగులో అనుబంధ పంటలుగా మొక్కజొన్న, జొన్న, సజ్జ, తదితర పంటలను సాగుచేయాలని డీపీఎం వెంకటమోహన్ సూచించారు. పీఎండీఎస్(ఫ్రీ మాన్‌సూన్ డ్రైయింగ్ సూయింగ్) సీజన్‌లో భాగంగా రాయచోటి మండలం బొట్లచెరువు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న వేరుశనగ పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పొలాలు, ఆర్‌ఎస్‌కె పరిధిలోని వీఏఏ, వీహెచ్‌ఏలతో కలిసి పరిశీలించామని, క్షేత్రస్థాయిలో రైతులకు మెలకువలు సూచిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నరెడ్డెన్న, హరిబాబు, అధికారులు పాల్గొన్నారు.
మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజున శుక్రవారం కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో అనంతపురం–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాంటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్‌లో 59.2 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని ఆదినారాయణ రెడ్డి 30 పరుగులు, కిరణ్ కుమార్ 31 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని యూహాస్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీయగా, వివేక్ 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 29 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. జట్టులోని రోహిత్ గౌడ్ 19, కెవీ.ఓంకార్ 18 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని సంతోష్ రెండు, టి.కిరణ్‌కుమార్ రెండు వికెట్లు తీశారు. దీంతో తొలిరోజున ఆట ముగిసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో చిత్తూరు–నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాంటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్‌లో 76.3 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని హర్ష 88 పరుగులు, మహ్మద్ షారుఖ్ అక్తర్ 60 పరుగులు, విజె నోయల్ 58 పరుగులు చేశారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 70 పరుగులు చేసింది.

ప్లేస్‌మెంట్ వ్యూహాలు కేరీర్ విజయానికి కీలకం