
ఆలయ పనులను నాణ్యతగా చేపట్టాలి
చిన్నమండెం : మండల పరిధిలోని దేవగుడిపల్లె గ్రామంలో వెలసిన మండెం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని పురావస్తు శాఖ ఏడీ రజిత కాంట్రాక్టర్‌కు సూచించారు. శుక్రవారం ఆమె మండెం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆమె వెంట తిమ్మారెడ్డి, కాంట్రాక్టర్ హరినాథరెడ్డి పాల్గొన్నారు.
నవ వధువు ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. రత్రీటౌన్ పోలీసుల వివరాల మేరకు.. కొర్రపాడు రోడ్డులోని భగత్‌సింగ్‌కాలనీ రెండో వీధికి చెందిన గౌస్‌బాషా కొన్నేళ్ల నుంచి కువైట్‌లో ఉంటున్నాడు. ఆయన కుమార్తె మహబూబ్‌చాంద్‌ను(18) మైదూకూరు మండలంలోని చౌటపల్లెకు చెందిన దావూద్ హుసేన్ పీర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. 24న ఉదయం భర్త దావూద్ హుసేన్‌పీర్ పని ఉందని చెప్పి మైదుకూరు రోడ్డుకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లిన మహబూబ్‌చాంద్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. ఆమె తల్లి ఫైరోజ్ బెడ్‌రూం వద్దకు వెళ్లి పిలవగా కుమార్తె పలకలేదు. బంధువులు తలుపులు పగలగొట్టి చూడగా ఉరేసుకుంది. కాగా మహబూబ్‌చాంద్‌కు ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌చాంద్ కొన్నేళ్ల నుంచి కడుపు నొప్పితో బాధపడుతోందని, చాలా హాస్పిటళ్లలో చూపించినా నయం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
మైనర్ బాలిక కేసు దర్యాప్తు దశలో ఏమీ చెప్పలేం
కడప అర్బన్: గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు దర్యాప్తు దశలో ఏమీ చెప్పలేమని, కేసును వీలైనంత తొందరగా ఛేదిస్తామని డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ గండికోట మైనర్ బాలిక కేసు కాస్త సమయం పడుతుందని, సెల్ టవర్ ఆధారంగా 350 మందిని గుర్తించామన్నారు. అదే రోజు పక్కనే ఉన్న గ్రామంలో ఒక జాతర జరిగిందన్నారు. రెండు సెల్ టవర్లు ఒకే ప్రాంతంలో ఉండడంతో ఆ ప్రాంతంలో 300 మందిని విచారించామని, మిగిలిన 50 మందిని విచారించాల్సి ఉందన్నారు. గత పది రోజులుగా 10 మంది అధికారులు అదే కేసుపై సీరియస్‌గా ఉన్నారన్నారు. గండికోట ప్రాంతంలో మైనర్ పిల్లలకు గదులు ఇవ్వకుండా పకడ్బందీగా చెప్పడం జరిగిందన్నారు. టూరిస్ట్ ఔట్ పోస్ట్ లో తనిఖీలు కంటిన్యూగా ఉంటాయన్నారు. మైనర్లు ఒంటరిగా గండికోట ప్రాంతానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.